NLG: కట్టంగూర్ మండలంలోని మునుకుంట్ల గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు, మాజీ సర్పంచ్ ఊట్కూరి భిక్షం శుక్రవారం గుండెపోటుతో కన్నుమూశారు. భిక్షం మరణానంతరం ఆయన కుటుంబీకులు విషాదం దిగమింగుకుని నేత్ర దానానికి ముందుకు వచ్చారు. నల్లగొండ ఐకాన్ లయన్స్ క్లబ్, నార్కట్పల్లి ఐ బ్యాంక్ సహకారంతో భిక్షం భౌతికకాయం నుంచి నేత్రాలను సేకరించారు.