MDK: ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్ చేపట్టిన పనులు త్వరిత గతిన పూర్తి చేయాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ ఛాంబర్లో ఇంజనీరింగ్ ద్వారా చేపట్టిన పనుల పురోగతిపై సమీక్షించారు. రోడ్లు, కోర్టు బిల్డింగ్స్ త్వరగా పూర్తి చేయాలని, క్షేత్రస్థాయిలో ఏమైనా సమస్యలు నెలకొన్న పక్షంలో పరిష్కరించుకొని ముందుకు పోవాలన్నారు.