NZB: సిరికొండలోని కొండూరులో GP పాలకవర్గం, వీడీసీ సభ్యులు మాదక ద్రవ్యాలను, కల్తీ ఐస్ క్రీమ్లను నిషేధిస్తూ తీర్మానం చేశారు. యువత, చిన్న పిల్లల ఆరోగ్య దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సర్పంచ్ నర్మల లత తెలిపారు. 23 ఏళ్ల లోపు వయస్సు ఉన్న వారికి (సిగరెట్,గుట్కా) క్రిమి సంహారక మందులతో తయారు చేసిన ఐస్ క్రీమ్లు అమ్మితే రూ.5,000 జరిమానా విధిస్తామని తీర్మానం చేశారు.