మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున ఒకే ఫ్రేమ్‌లో కనిపించి అభిమానులను ఖుషీ చేశారు. ఏఎంఆర్ గ్రూప్ ఛైర్మన్ మహేష్ రెడ్డికి డాక్టరేట్ వచ్చిన సందర్భంగా ఏర్పాటు చేసిన విందులో ఈ అరుదైన కలయిక జరిగింది. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజుతో నాగ్ ముచ్చటిస్తుండగా, చిరు పక్కనే ఉండి ఆ క్షణాలను ఆస్వాదిస్తున్న ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.