SRPT: చిలుకూరు జానకి నగర్ గ్రామంలో లక్షల వ్యయంతో నిర్మించిన వైకుంఠధామం, డంపింగ్ యార్డులు దారి లేక నిరుపయోగంగా ఉన్నాయి. ఈ మేరకు కాంగ్రెస్ నేతలు అమృనాయక్, బానోతు రవి సోమవారం సూర్యాపేట కలెక్టరేట్ కార్యాలయంలో సంబంధిత అధికారికి ఫిర్యాదు చేశారు. దారి సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే సమస్యను పరిష్కరించి వాటిని అందుబాటులోకి తీసుకురావాలని విన్నవించారు.