MNCL: జన్నారం మండలంలోని చింతగూడ గ్రామపంచాయతీలో సోమవారం నుంచి 10వ తేదీ వరకు ఆధార్ స్పెషల్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు ASP రామారావు తెలిపారు. ఈ శిబిరంలో పేరు, పుట్టిన తేదీ సవరణలు, ఫొటో అప్డేట్, అడ్రస్ మార్పు, ఫోన్ నంబర్ లింకింగ్ వంటి సేవలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. గ్రామ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.