NLG: MGUలో భారీ జీఎస్టీ కుంభకోణం వెలుగుచూసింది. యూనివర్సిటీకి సిబ్బందిని సరఫరా చేస్తున్న ఓ ఔట్సోర్సింగ్ ఏజెన్సీ లక్షల్లోనే పన్ను ఎగవేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనల ప్రకారం చెల్లించాల్సిన జీఎస్టీని సదరు ఏజెన్సీ ఎగ్గొడుతున్నా, వర్సిటీ అధికారులు ఈ వ్యవహారాన్ని గోప్యంగా ఉంచడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.