KRNL: మాజీ సీఎం జగన్‌పై మంగళవారం మంత్రి సవిత సెటైర్లు వేశారు. జగన్ ‘మావిగన్’ ప్రతిపాదనపై ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. అంబులెన్స్‌కే సైడ్ ఇవ్వని జగన్ ప్రజలకు ఏం సందేశం ఇస్తారు..? అని ప్రశ్నించారు. పూటకో మాట.. గంటకో వేషం వేయడం జగన్ నైజం అని మండిపడ్డారు. లోటస్ పాండ్‌ను కూడా రాజధాని అంటారేమో అని ఎద్దేవా చేశారు.