PPM: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలను ఎప్పటికప్పుడు, నాణ్యతతో పరిష్కారించాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో పీజీఆర్ఎస్ కార్యక్రమం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఇందులో 111 అర్జీలు అందగా, వాటిలో 25 రెవిన్యూ శాఖవి కాగా, ఇతర శాఖలకు చెందినవి 86 అందాయని అన్నారు.