KDP: వల్లూరు మండలం అచ్చింతరాయపల్లి గ్రామంలో బస్టాండ్ సమీపంలోని విజయ్ దుర్గమ్మ గుడి వద్ద దారుణ హత్య చోటుచేసుకుంది. కొప్పల వెంకటసుబ్బయ్యను ప్రత్యర్థులు కత్తులతో దారుణంగా నరికి హతమార్చారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు గల కారణాలపై విచారణ కొనసాగుతోంది.