JGL: క్షయవ్యాధి పూర్తిగా నయం చేయగల వ్యాధి అని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. జగిత్యాలలో TB దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. లక్షణాలు కనిపించగానే వెంటనే పరీక్షలు చేయించుకుని, సరైన చికిత్స పొందాలన్నారు. దగ్గు, జ్వరం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత పరీక్షలు, చికిత్స అందుబాటులో ఉన్నాయన్నారు.