MULG: వెంకటాపురం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం మంత్రి సీతక్క ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ దివాకర తెలిపారు. వెంకటాపురం, వాజేడు, ఏటూరునాగారం, మంగపేట, కన్నాయిగూడెం మండలాల ప్రజలు తమ వినతులను మంత్రికి నేరుగా సమర్పించవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు హాజరు కావాలని సూచించారు.