SDPT: సూర్యుడి చుట్టూ భూమి తిరిగినట్టే, భూముల చుట్టూ రేవంత్ రెడ్డి తిరుగుతున్నారని హరీశ్ రావు విమర్శించారు. కోహెడ పండ్ల మార్కెట్ భూమిపై ఇప్పుడు రేవంత్ కన్ను పడిందన్నారు. ఈ మార్కెట్ వేలమంది ప్రజలకు, లక్షలాది రైతులకు జీవనాధారం అని తెలిపారు. ఇలాంటి పరిస్థితిలో రేవంత్ రెడ్డి రైతుల పక్షాన ఉన్నారా, లేక దళారుల పక్షాన నిలుస్తున్నారా అని ప్రశ్నించారు.