TG: HYDలోని ఆచార్య జయశంకర్ అగ్రికల్చర్ వర్సిటీ అసోసియేట్ డీన్ గోవర్ధన్, రూ.లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. ఒక విత్తన కంపెనీ నుంచి ఈ మొత్తాన్ని వసూలు చేస్తుండగా అధికారులు దాడి చేశారు. ఈ క్రమంలో రాజేంద్రనగర్లోని కాలేజీతో పాటు, ఎల్బీనగర్లోని ఆయన నివాసంలోనూ ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి.