గువాహటి వేదికగా జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ నిర్ణీత 11 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్(37 బంతుల్లో 77*) ఆకాశమే హద్దుగా చెలరేగగా, వైభవ్ సూర్యవంశీ (39), రియాన్ పరాగ్ (20) వేగంగా ఆడారు. ముంబై బౌలర్లలో ఘజన్ఫర్ 2, శార్దూల్ ఒక వికెట్ తీశారు. వర్షం కారణంగా మ్యాచ్ను 11 ఓవర్లకు కుదించారు.