TG: అనంతసాగర్లో జరిగిన BJP కార్యకర్తల సమావేశంలో MP రఘునందన్ రావు పాల్గొన్నారు. కేంద్ర నిధులతో గ్రామాలను అభివృద్ధి చేస్తామని, రాజీవ్ రహదారికి సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రైతుల కోరిక మేరకు రంగనాయక సాగర్ కాలువను అనంతసాగర్ వరకు పొడిగించాలని అధికారులను ఆదేశించారు. కార్యకర్తలు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, ప్రజల్లో అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు.