AP: నెల్లూరులో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద ఆ సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణపై చేసిన వ్యాఖ్యలు, కార్యాలయంపై దాడికి యత్నించిన ఆరోపణల నేపథ్యంలో వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై పోలీసులు పలు కేసులు నమోదు చేశారు. నెల్లూరు బ్రాంచ్ మేనేజర్ కే హరికృష్ణ ఫిర్యాదు మేరకు నెల్లూరు పోలీసులు కాకాణిపై BNS 189(2), 126(2), 79, 351(2) R/W 190 సెక్షన్లు పెట్టినట్లు సమాచారం.