MHBD: తొర్రూరు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఇవాళ స్థానిక తహసీల్దార్ గడీల శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. వేసవి దృష్ట్యా వివిధ పనులపై కార్యాలయానికి వచ్చే ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేశామని తెలిపారు. వడదెబ్బకు గురికాకుండా మంచినీరు ఎక్కువగా తాగాలని సూచించారు.