MBNR: జిల్లాలో వేసవి ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు సుమారు 36 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. మధ్యాహ్న సమయంలో వేడి తీవ్రంగా ఉండటంతో ప్రజలు బయటకు రావడాన్ని తగ్గిస్తున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. అవసరం లేనిపక్షంలో బయటకు రాకూడదని అధికారులు హెచ్చరిస్తున్నారు.