KMM: చింతకాని బీఆర్ఎస్ మండల నాయకులు మొక్కజొన్న రైతులు పండించిన పంటకు సరైన మద్దతు ధర లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. రైతులు ఎంతో శ్రమించి పండించిన ప్రతి గింజను ప్రభుత్వం తప్పనిసరిగా కొనుగోలు చేయాలని, క్వింటాకు రూ. 2600 మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు.