AP: విజయవాడ ఉగ్ర లింకుల కేసులో వైద్య పరీక్షల తర్వాత నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. సద్దాం దిల్కష్, లక్కీ అహ్మద్, అబ్దుల్ మాజిద్, అష్రఫ్ అలీ, షారుక్ ఖాన్, రెహమాన్‌కు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఐదు రోజులు పోలీసులు వారిని విచారించనున్నారు. కాగా విజయవాడ ఉగ్ర లింకుల కేసులో ఇప్పటివరకు 12 మందిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.