కర్నూలు: న్యాయవాదుల రక్షణ చట్టం వెంటనే అమలుపరచాలని కర్నూలు న్యాయవాదుల సంఘం డిమాండ్ చేశారు. గురువారం పీలేరు బార్లో అడ్వకేట్ విధులు నిర్వహిస్తున్న పూజారి ఎల్లయ్య అనే న్యాయవాదిని కొందరు గుర్తుతెలియని దుండగులు హత్యకు నిరసనగా న్యాయవాదుల సంఘం కోర్టు ఎదుట నిరసన వ్యక్తం చేశారు. న్యాయవాదిని దారుణంగా హత్య చేసిన దుండగులను గుర్తించి వెంటనే శిక్షించాలన్నారు.