KNR: రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికపరమైన ఇబ్బందులున్నప్పటికీ సంక్షేమ పథకాలు కొనసాగిస్తామని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. శుక్రవారం ఎల్ఎండీ కాలనీలోని ప్రజాభవన్లో ఆయన తిమ్మాపూర్ మండలానికి చెందిన143 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం MLA మాట్లాడుతూ.. ఆర్థిక పరిస్థితిని కారణంగా చూపుతూ సంక్షేమ పథకాలను ఆపబోమని స్పష్టం చేశారు.