TG: శంషాబాద్ రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు మరోసారి ప్రత్యేకతను చాటుకుంది. ప్రఖ్యాత స్కైటాక్స్ సంస్థ నుంచి ‘బెస్ట్ ఎయిర్‌పోర్టు స్టాఫ్ ఇన్ ఇండియా & సౌత్ ఏషియా 2026’ అవార్డును గెలుచుకుంది. ఈ విమానాశ్రయానికి ఈ ప్రతిష్టాత్మక పురస్కారం రావడం 5వ సారి. లండన్‌లో జరిగిన ప్యాసింజర్ టెర్మినల్ ఎక్స్పో 2026లో ఈ అవార్డును అధికారికంగా ప్రకటించారు.