HNK: కాజీపేట మండలం ‘మా’ గార్డెన్స్‌లో నిర్వహించిన కార్యక్రమంలో గురువారం ఎమ్మెల్యే నాగరాజు లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. 80 మందికి రూ. 80.09 లక్షల విలువైన చెక్కులు, అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 18 మందికి రూ. 4.30 లక్షల చెక్కులు అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేద, బడుగు వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.