నటుడు రాజశేఖర్ తన లేటెస్ట్ మూవీ ‘బైకర్’ ప్రమోషన్స్‌లో ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఈ సినిమా చేయాలా? వద్దా? అనే సందిగ్ధంలో ఉన్నప్పుడు తన భార్య జీవిత, కూతుళ్లు శివాని, శివాత్మికలే ధైర్యం చెప్పారని తెలిపాడు. వారు ముగ్గురూ తనకు కోచ్‌లుగా మారి సలహాలిచ్చారని, వారి ప్రోత్సాహంతోనే ఈ ప్రాజెక్ట్ ఒప్పుకున్నానని చెప్పాడు.