అన్నమయ్య: లక్కిరెడ్డిపల్లి మండలం కోనంపేట గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఎలుగోటి రామకృష్ణ (55) తన ఇంటిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రైవేట్ పాఠశాలలో టీచర్‌గా పనిచేసిన ఆయన, ఇటీవల ఉద్యోగం మానేసి వ్యవసాయ పనులు చేస్తున్నట్లు సమాచారం. మధ్యాహ్నం సమయంలో భార్య గమనించడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.