NGKL: వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెల్కపల్లి పర్యటన ఖరారైన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ సంతోష్ కుమార్ ఏర్పాట్లను వేగవంతం చేశారు. రూ.1.56 కోట్లతో పూర్తైన ప్రజా ఆరోగ్య భవనాన్ని పరిశీలించి, శిలాఫలకాల ఏర్పాటు వివరాలు తెలుసుకున్నారు. మంత్రి రాక సందర్భంగా ఎలాంటి లోపాలు ఉండకూడదని సిబ్బందికి సూచించారు.