స్మార్ట్‌టీవీ యూజర్లకు యూట్యూబ్ షాకివ్వనుంది. ఇకపై వీడియోల మధ్య ఏకంగా 90 సెకన్ల పాటు స్కిప్ చేయలేని ప్రకటనలను తీసుకురానుంది. ఆదాయం పెంచుకోవడంతో పాటు, యూజర్లను ప్రీమియం వైపు మళ్లించడమే దీని లక్ష్యమని తెలుస్తోంది. దీనిపై నెటిజన్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం స్మార్ట్టీవీలకేనా? మొబైల్‌కూ వర్తింపజేస్తారా వేచి చూడాలి.