AP: రాజీనామా చేసే ధైర్యం జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డికి లేదని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి అన్నారు. ఆదినారాయణ రెడ్డి కూటమి ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని తెలిపారు అక్రమ సంపాదన పెంచుకోవడానికే రాజానామా డ్రామా ఆడుతున్నారని మండిపడ్డారు. కూటమి ఎమ్మెల్యేలు అవినీతి అనకొండల్లా తయారయ్యారని విమర్శించారు.