AKP: చిన్నారుల ఉజ్వల భవిష్యత్తుకు అధికారులు కృషి చేయాలని కలెక్టర్ విజయ కృష్ణన్ సూచించారు. గురువారం కలెక్టరేట్లో 8వ పోషణ్ పక్వాడ అవగాహన పక్షోత్సవాల గోడపత్రికను ఆమె ఆవిష్కరించారు. గర్భిణీలు చిరుధాన్యాలు వంటి సంప్రదాయ ఆహారం తీసుకునే విధంగా చూడాలన్నారు. అలాగే, వివిధ థీమ్‌ల ప్రకారం కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.