GDWL: అయిజ పట్టణ విద్యార్థుల కోసం మంజూరైన గురుకుల పాఠశాలను 40 కిలోమీటర్ల దూరంలోని ఎర్రవల్లికి తరలించడాన్ని ఎమ్మార్పీఎస్ నాయకుడు అయిజ మాదిగ రాజు వ్యతిరేకించారు. గురువారం ఆయన అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, మున్సిపల్ ఛైర్మన్ సీఎం సురేష్లను కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. ఇంతటి దూరభారం వల్ల పేద విద్యార్థులు నాణ్యమైన విద్యకు దూరమవుతారన్నారు.