హీరోయిన్ ఆయుష్మాన్ ఖురానా, యంగ్ సెన్సేషన్ సారా అలీఖాన్ జంటగా నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ఉడ్తా తీర్. ప్రముఖ రచయిత ఆకాష్ ఎ కౌశిక్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీని మేకర్స్ తాజాగా అధికారికంగా ప్రకటించారు. సెప్టెంబర్ 11, 2026న థియేటర్లలో విడుదల చేయనున్నారు.