AP: నర్సింగ్ విద్యాసంస్థల ఏర్పాటుపై మంత్రి సత్యకుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘ప్రభుత్వ ప్రకటనల మేరకు వచ్చే దరఖాస్తులనే పరిగణనలోకి తీసుకోవాలి. స్వచ్ఛందంగా వచ్చే ప్రతిపాదనలు పరిశీలించం. రాష్ట్రంలో 691 నర్సింగ్ విద్యాసంస్థలు ఉన్నాయి. ఏటా 32 వేల మంది నర్సులు శిక్షణ పొందుతున్నారు. మారుతున్న పరిస్థితుల మేరకు అనుగుణంగా నర్సులకు శిక్షణ ఇవ్వాలి’ అని అధికారులకు సూచించారు.