వేసవిలో పిల్లల ఇమ్యూనిటీ పెరగాలంటే పోషకాహారం తప్పనిసరి. చెమట వల్ల శక్తి తగ్గి అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉన్నందున ఐస్‌క్రీమ్స్, కూల్‌డ్రింక్స్‌కు దూరంగా ఉంచాలి. విటమిన్లు, జింక్ అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు, పెరుగు వంటివి అందించాలి. సరైన నిద్ర, పౌష్టికాహారంతో పిల్లల్లో బ్యాక్టీరియాను ఎదుర్కొనే రోగనిరోధక శక్తి పెరుగుతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.