AP: YCP చీఫ్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలోని మహిళలకు పెద్దపీట వేశారని MP మిథున్ రెడ్డి అన్నారు. పార్లమెంటులో సవరణ బిల్లుపై మాట్లాడుతూ.. అన్ని సంక్షేమ పథకాలను మహిళల ద్వారానే అందించామని పేర్కొన్నారు. ఇక విభజన సమయంలో APకి ప్రత్యేక హోదా హామీ ఇచ్చారు కానీ చట్టం లేదని తర్వాత ఇవ్వలేదని గుర్తుచేశారు. అలాగే డీలిమిటేషన్ను విపక్షాలను అణగదొక్కేందుకు వాడొద్దని కోరారు.