NDL: కలెక్టరేట్ పీజీఆర్ఎస్ హాల్లో నిర్వహించిన 100 రోజుల ‘జలధార’ కార్యక్రమ వర్క్‌షాప్‌లో ఇవాళ కలెక్టర్ రాజకుమారి అధికారులకు అవగాహన కల్పించారు. భూగర్భ జలాల పెంపు, నీటి వనరుల సమర్థ వినియోగం, గ్రామీణ ప్రాంతాల్లో నీటి సమస్యల నివారణ లక్ష్యాలుగా పని చేయాలని సూచించారు. కార్యక్రమ అమలు విధానం, ప్రణాళికలు, సాంకేతిక వినియోగంపై వివరించి దిశానిర్దేశం చేశారు.