ASF: లింగాపూర్, పెంచికల్ పేట్, చింతలమానేపల్లి మండలాల్లో ప్రభుత్వ జూనియర్ కాలేజీలు లేక విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారని CPM జిల్లా కార్యదర్శి దినకర్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. పదో తరగతి తర్వాత ఇంటర్ చదవడానికి దూర ప్రాంతాలకు వెళ్లాల్సి రావడంతో పలువురు చదువు మానేస్తున్నారన్నారు. వెంటనే జూనియర్ కళాశాలలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.