KMM: ఎర్రుపాలెం మండలంలో శుక్రవారం పోలీస్ శాఖ స్పెషల్ డ్రైవ్లో భాగంగా ఎస్సై రమేష్ ప్రైవేట్ స్కూల్ బస్సుల ఫిట్నెస్ను పరిశీలించారు. బస్సుల పరిస్థితి, భద్రతా ప్రమాణాలను తనిఖీ చేసి డ్రైవర్ల లైసెన్సులను పరిశీలించారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని డ్రైవర్లకు సూచించారు. లోపాలు ఉంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.