KMR:రామరెడ్డి మండలంలోని పోషనిపేట్ గ్రామంలో ఏర్పాటు చేసిన, వరి ధాన్యపు కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన కేంద్రంలో జరుగుతున్న ధాన్యం కొనుగోలు విధానాన్ని సమీక్షించి, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా, కొనుగోలు ప్రక్రియ కొనసాగించాలని అధికారులకు సూచించారు.