ADB: నార్నూర్ మండలంలోని రాజులగూడ గ్రామంలో ‘ప్రజాపాలన’లో భాగంగా వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది డెంగీ, మలేరియా నివారణపై విస్తృత సర్వే నిర్వహించారు. HEO తులసిదాస్ పర్యవేక్షణలో ఇంటింటికీ వెళ్లి పరిశుభ్రత, యాంటీ లార్వా చర్యలు చేపట్టి ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం నిర్వహించిన వైద్య శిబిరంలో 49 మందికి పరీక్షలు చేసి రక్త నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపించారు.