TG: బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలపై కేంద్రమంత్రి బండి సంజయ్ స్పందించారు. కాంగ్రెస్ తప్పిదాలతోనే బలిదానాలని తేజస్వి అన్నారన్నారు. 2009లో తెలంగాణను ప్రకటించి వెనక్కి తగ్గారని గుర్తుచేశారు. ఇదే విషయాన్ని తేజస్వి ప్రస్తావించారన్నారు. రేవంత్ రెడ్డి గతంలో సోనియాగాంధీని బలిదేవత అన్నారని ఉద్ఘాటించారు. తెలంగాణను వ్యతిరేకించిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని మండిపడ్డారు.