E.G: చిన్నకొండెపూడి వైసీపీ నాయకుడు చేకూరి సత్తిపండు రాజు మృతి పట్ల మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. మృతుని స్వగృహానికి చేరుకున్న రాజా భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కష్ట సమయంలో వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పారు. పార్టీకి ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకుంటూ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.