NTR: వీరులపాడు మండలం జయంతి గ్రామంలో శుక్రవారం పశుపోషణపై ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కృష్ణ మిల్క్ యూనియన్ ఛైర్మన్ చలసాని ఆంజనేయులు పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పాడి రైతుల అభివృద్ధికి కృష్ణ మిల్క్ యూనియన్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. పశుపోషణను లాభదాయకంగా మార్చేందుకు అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.