ఇంటి పైకప్పుపై వైట్ కూల్ పెయింట్(Cool Roof Paint) వేయడం వల్ల ఎండ వేడిని గణనీయంగా తగ్గించుకోవచ్చు. ఈ పెయింట్ సూర్యరశ్మిని పరావర్తనం(Reflect) చెందించి, పైకప్పు వేడెక్కకుండా చూస్తుంది. దీనివల్ల గది ఉష్ణోగ్రత 3-5 డిగ్రీల వరకు తగ్గి, లోపల చల్లగా ఉంటుంది. ఫలితంగా ఏసీ, ఫ్యాన్ల వాడకం తగ్గి విద్యుత్ బిల్లులు ఆదా అవుతాయి. వేసవిలో చలువ కోసం ఇది తక్కువ ఖర్చుతో కూడిన ఉత్తమ మార్గం.