VZM: జాతీయ రహదారులపై అనుమతి లేని ప్రదేశాల్లో వాహనాలు నిలిపితే కేసులు నమోదు చేసి, వాహనాలు సీజ్ చేస్తామని SP దామోదర్ శుక్రవారం హెచ్చరించారు. దాబాలు, మలుపులు, వంతెనలు, జంక్షన్ల వద్ద వాహనాలు నిలిపివేయడం ప్రమాదాలకు దారి తీస్తోందన్నారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అనుమతించిన పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలు ఆపాలని, హజార్డ్ లైట్లు ఆన్ చేయాలని సూచించారు.