TG: సిరసపల్లిలో డంపింగ్ యార్డును రద్దు చేసే వరకు విశ్రమించేది లేదని MLA కౌశిక్‌రెడ్డి స్పష్టం చేశారు. హుజూరాబాద్‌లో ఇతర జిల్లాల చెత్తను వేయడం వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుందని, భూముల ధరలు పడిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్ణయం మార్చుకోకపోతే ఈనెల 22 నుంచి పాదయాత్ర చేస్తామన్నారు. ఈ వ్యర్థాల యార్డును సీఎం కొడంగల్‌కు తరలించాలని డిమాండ్ చేశారు.