BHPL: గోరికొత్తపల్లి మండలం నిజాంపల్లి ప్రభుత్వ పాఠశాలలో మాజీ ఇన్ఛార్జ్ HM కర్రె ఉమాదేవి 2024-25 నిధులను దుర్వినియోగం చేస్తున్నారని BSF ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కాడపాక రాజేందర్ ఆరోపించారు. ఈ మేరకు శుక్రవారం గోరికొత్తపల్లి MEOకు ఫిర్యాదు చేశారు. ఆయన మాట్లాడుతూ.. నిందితురాలుపై సమగ్ర విచారణ జరపాలని.. లేకపోతే కలెక్టర్ ఆఫీస్ ముట్టడిస్తామని హెచ్చరించారు.