శ్రీకాకుళంలో ఎమ్మెల్యే గొండు శంకర్ చేతుల మీదుగా ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులు పంపిణీ అయ్యాయి. మొత్తం రూ. 25.70 లక్షల విలువైన 13 చెక్కులను నిరుపేద కుటుంబాలకు అందించారు. వీటిలో 7 చెక్కులు ప్రత్యేక చొరవతో మంజూరు చేయించారని ఎమ్మెల్యే తెలిపారు. పేదలు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ప్రభుత్వం అండగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు.