AKP: గర్భిణీలు, బాలింతలు, పిల్లలకు పోషకాహారాన్ని ఇవ్వాలని ఐసీడీఎస్ సూపర్వైజర్ అన్నపూర్ణ, అంగన్వాడీ కార్యకర్త నాగమణి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం మునగపాక మండలం పాటిపల్లిలో పోషణ్ పక్వాడ కార్యక్రమాన్ని నిర్వహించారు. జింక్ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలని అన్నారు. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. సకాలంలో వ్యాధికి నిరోధక టీకాలు ఇవ్వాలన్నారు.